ChandraBabu: అందరికీ న్యాయం అందాలనేదే రాజ్యాంగం లక్ష్యం...! 26 d ago
రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ గుర్తుపెట్టుకోవాలని ఆయన చెప్పారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి రాజ్యాంగం రచించారని అన్నారు. రాజ్యాంగ పరిషత్ లో తెలుగు వాళ్లు ప్రధాన పాత్ర పోషించారని వ్యాఖ్యానించారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలనేదే రాజ్యాంగం లక్ష్యం అని పేర్కొన్నారు.